కరోనా వైరస్‌ కట్టడికి ‘ మహా మృత్యుంజయ యజ్ఞం’

ABN , First Publish Date - 2020-03-30T19:56:43+05:30 IST

ప్రపంచంలోని సమస్త మానవాళిని కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి రక్షించాలని కోరుకుంటూ సోమవారం పాతబస్తీలోని లక్ష్మణేశ్వర ఆలయంలో శ్రీమహా మృత్యుంజయ మహా యజ్ఞానాన్ని ఘనంగా సంప్రదాయబద్దంగా నిర్వహించారు

కరోనా వైరస్‌ కట్టడికి ‘ మహా మృత్యుంజయ యజ్ఞం’

హైదరాబాద్‌: ప్రపంచంలోని సమస్త మానవాళిని కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి రక్షించాలని కోరుకుంటూ సోమవారం పాతబస్తీలోని లక్ష్మణేశ్వర ఆలయంలో శ్రీమహా మృత్యుంజయ మహా యజ్ఞానాన్ని ఘనంగా సంప్రదాయబద్దంగా నిర్వహించారు. గత కొన్నిరోజులుగా కరోరా వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలని కోరుతూ పాతబస్తీలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు,యజ్ఞాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే  సోమవారం పాతబస్తీలోని ప్రముఖ దేవాలయమైన లక్ష్మణేశ్వర ఆలయంలో ఈ యజ్ఞాన్ని ఆలయ కమిటీ ఛైర్మన్‌ అన్నారావు కులకర్ణి, అధ్యక్షులు మారెడ్డి దామోదరరెడ్డి, సలహాదారు వరకాల యాదగిరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహా మృత్యుంజయ మహా యజ్ఞాన్నినిర్వహించారు. కరోనా వైరస్‌ సంపూర్ణంగా నశించాలని భారతీయ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకుంటూ స్వాహాకారాన్ని నిర్వహించారు. కరోనా వైరస్‌ బాఽధితులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారి వారి ఇళ్లకు త్వరగా చేరుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక సుప్రసిద్ధమైన ఛత్రినాక శ్రీ లక్ష్మణేశ్వర ఆలయంలో జరిగిన మృత్యుంజయ మహా యజ్ఞంలో ప్రొఫెసర్‌ సోమనాధరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు కుమార్‌, శ్రీకాంత్‌, రాజలింగంతో పాటు పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T19:56:43+05:30 IST