ఎప్పుడు రిటైర్ అవ్వాలో నిర్ణయం తీసుకొనే అధికారం ధోనీకి ఉంది: గ్యారీ క్రిస్టన్

ABN , First Publish Date - 2020-05-28T20:20:52+05:30 IST

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టు కోచ్ గ్యారీ క్రిస్టన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈతరం ఆటగాళ్లలో ధోనీ అత్యుత్తమ ఆటగాడు అని

ఎప్పుడు రిటైర్ అవ్వాలో నిర్ణయం తీసుకొనే అధికారం ధోనీకి ఉంది: గ్యారీ క్రిస్టన్

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టు కోచ్ గ్యారీ క్రిస్టన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈతరం ఆటగాళ్లలో ధోనీ అత్యుత్తమ ఆటగాడు అని ఆయన అన్నారు. అంతేకాక.. ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనే విషయంలో నిర్ణయం తీసుకొనే అధికారం ధోనీకి ఉందని.. ఆ విషయం అతనికే వదిలేయాలని అని ఆయన పేర్కొన్నారు. 


బుధవారం ‘ధోనీ రిటైర్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ధోనీ భార్య సాక్షి స్పందించింది. ధోనీ రిటైర్‌మెంట్ కేవలం రూమర్ మాత్రమే అని.. ఈ లాక్‌డౌన్ సమయంలో కొందరి మతిభ్రమించి ఉంటుందని ఆయన ట్వీట్ చేసింది. ఈ నేపథ్యం గ్యారీ కూడా ధోనీ రిటైర్‌మెంట్‌పై వ్యాఖ్యలు చేశారు. 


‘‘ఎంఎస్ ధోనీ అత్యద్భుతమైన క్రికెటర్. తెలివి, ప్రశాంతత, శక్తి, వేగం తదితర లక్షణాలు అతన్ని ఇతరుల నుంచి వేరు చేస్తాయి. ఈతరంలో అతను అత్యుత్తమ ఆటగాడు. ఆట నుంచి ఎప్పుడు తప్పుకోవాలో నిర్ణయం తీసుకొనే అధికారం అతనికి ఉంది. అతనికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’’ అని గ్యారీ క్రిస్టన్ అన్నారు. 

Updated Date - 2020-05-28T20:20:52+05:30 IST