ఎమ్మెల్యే జోగి దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2021-09-18T06:14:09+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడిని నిరసిస్తూ టీడీపీ మండల, తెలుగు యువత ఆధ్వర్యం లో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ దిష్టిబొ మ్మను కళ్యాదుర్గం బైపాస్‌ సర్కిల్‌ల్లో శుక్రవారం సాయంత్రం దహనం చేశారు.

ఎమ్మెల్యే జోగి దిష్టిబొమ్మ దహనం
అనంతపురంలో ఎమ్మెల్యే జోగి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

  చంద్రబాబు ఇంటిపై దాడిని నిరసిస్తూ 

అనంతపురంరూరల్‌,సెప్టెంబరు 17 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడిని నిరసిస్తూ టీడీపీ మండల, తెలుగు యువత ఆధ్వర్యం లో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ దిష్టిబొ మ్మను కళ్యాదుర్గం బైపాస్‌ సర్కిల్‌ల్లో శుక్రవారం సాయంత్రం దహనం చేశారు. కార్యక్రమంలో మండల మాజీ కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి, కురుగుంట నారాయణస్వామి, రామాంజినేయులు, పేరంహరి, ఇమాముల్‌, పూజారప్ప, శంకర్‌, బ్యాళ్లరాము, నాగలింగారెడ్డి, బొమ్మనాగరాజు, దస్తగిరి,టిఎనఎ్‌సఎ్‌ఫ హిందుపురం పార్లమెంట్‌ అధ్యక్షులు జగదీష్‌, కొడిమి నాగరాజు, నరేష్‌, రామకృష్ణ, మహేంద్ర, మద్దినేనికృష్ణ, హరీ్‌షరెడ్డి, భరత, చల్లానాయుడు, వెంకట్‌, సంతోష్‌, ఆది పాల్గొన్నారు. 


దాడి అనాగరికం : వైకుంఠం 

అనంతపురం వైద్యం : చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్‌ అనుచరులతో వెళ్ళి రాళ్ల దాడి చేయడం అనాగరిక చర్య అని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో సాగుతున్న అరాచక, రౌడీ పాలనపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు. నివేదికలు తెప్పించుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. దాడికి ఉసుగొలిపిన ఎమ్మెల్యే జోగి రమేష్‌, వైసీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని   డిమాండ్‌ చేశారు. 


జోగిని అరెస్టు చేయాలి : బండారు శ్రావణిశ్రీ

శింగనమల : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ బండారు శ్రావణిశ్రీ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆమె తన స్వగృహంలో మాట్లాడుతూ.. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నేత ఇంటిపైకి వైసీపీ గూండాలు రాళ్లు, కర్రలతో దాడి చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు.  కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్‌ చితంబరి దొర, గుర్రం లక్ష్మినారాయణ, చిదానందనాయుడు, పెద్దిరెడ్డి, ఆలం నాగార్జున, చంద్రమోహన, నరసయ్య, శేషానందరెడ్డి, రమణప్ప, పెద్దప్ప, చల్లా నాగరాజు, విజయ్‌, పప్పూరు శీనా, బోయ సత్యనారాయణ, ఆది, లక్ష్మినారాయణ, నరసింహ, లోకేష్‌, ప్రతాప్‌, మిట్టా పవన, సుదర్శన నాయక్‌, మల్లి  పాల్గొన్నారు.


దాడి అమానుషం : ముంటిమడుగు  

గార్లదిన్నె : నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేయడం అమానుషం అని టీడీపీ సీనియర్‌ నాయకులు, నియోజకవర్గం కార్యక్రమాల అమలు, కమిటీల ఎంపిక బాధ్యలు ముంటిమడుగు కేశవరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీ రాజ్యానికి ఇది అద్దం పడుతోందన్నారు. 


రాష్ట్రంలో తాలిబాన పాలన  :  రామలింగారెడ్డి 

బుక్కరాయసముద్రం  : రాష్ట్రంలో వైసీపీ గుండా లతో సీఎం జగన తాలిబన పాలన సాగిస్తున్నారని మాజీ జెడ్పీటీసీ రామలింగారెడ్డి ధ్వజమెత్తారు.  రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయాలనే కుట్రపన్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం తేదేపా నేతలపైనే కేసులు, అక్రమ అరెస్టులు, దాడులు జరుగుతున్నాయన్నారు.  


ఇది వైసీపీ కుట్రే : శ్రీధర్‌బాబు 

చంద్రబాబు ఇంటిపై దాడి వైకాపా కుట్రలో భాగమేనని  అనంతపురం పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతి నిధి పర్వతనేని శ్రీధర్‌ బాబు ఆరో పించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రఽశ్నిస్తే దాడులు చేస్తారా? అన్ని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో శాంతిభద్ర తలు ఏ విధంగా ఉన్నయనే దానికి తాజా ఘటనే నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. 


సీఎం అండతోనే దాడి

చెన్నేకొత్తపల్లి : ముఖ్యమంత్రి వైఎ్‌సజగన అండదండలతోనే వైసీపీ నాయకులు, కార్యక ర్తలు రాష్ట్రంలో దాడులకు పాల్పడుతున్నారని హిందూపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు దండుఓబుళేశు, కన్వీనర్‌ రామక్రిష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ అరాచక పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చెన్నకేశవగౌడ్‌, తెలుగుయువత చంద్ర, గేటు కిష్టప్ప, కోళ్లసూరి, అమరేంద్రరెడ్డి, టీఎనఎ్‌సఎ్‌ఫ నాగార్జున, తలారినాగన్న, అహమ్మద్‌బాషా, భాస్కర్‌, రాజు, ముత్యాలు, నరేంద్రరెడ్డి, మారుతీ, మహేశ; హరినాథ్‌రెడ్డి, ఓబుళేశు, అక్కులప్ప పాల్గొన్నారు.


Updated Date - 2021-09-18T06:14:09+05:30 IST