May 7 2021 @ 23:03PM

గుండె పోటుతో నిర్మాత ఎం.ఎస్‌. ప్రసాద్‌ కన్నుమూత

చిత్ర పరిశ్రమలో ఎం.ఎస్‌. ప్రసాద్‌గా సుపరిచితులైన సీనియర్‌ నిర్మాత మర్రిపాటి సత్యనారాయణ ప్రసాద్‌ గురువారం రాత్రి గుండెపోటుతో చెన్నైలో కన్ను మూశారు. ఆయన 1945 జూలై 18న మచిలిపట్నంలో జన్మించారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు బావగారు. సుబ్బారావుతో కలసి కృష్ణ హీరోగా ‘మాయదారి మల్లిగాడు’, ‘గాజుల కిష్టయ్య’ చిత్రాలు నిర్మించారు. తర్వాత హీరో కృష్ణతోనే ‘రక్త సంబంధం’, ‘పంచాయతీ’, ‘సిరిమల్లె నవ్వింది’ చిత్రాలు తీశారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్‌ హీరోగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ‘మన్మథ లీల కామరాజు గోల’, ‘రంభ రాంబాబు’ చిత్రాలను నిర్మించారు. అనంతరం సినిమా నిర్మాణం అపేసినా ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌గా పరిశ్రమలో కొనసాగారు. ఎం.ఎస్‌.ప్రసాద్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.