అంబేడ్కర్‌ స్మృతివనానికి వైసీపీ ఎందుకు వ్యతిరేకం?

ABN , First Publish Date - 2020-07-14T11:20:04+05:30 IST

అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్‌..

అంబేడ్కర్‌ స్మృతివనానికి వైసీపీ ఎందుకు వ్యతిరేకం?

టీడీపీ ఎస్సీ సెల్‌  రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎ్‌స రాజు


కళ్యాణదుర్గం టౌన్‌, జూలై 13: అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎ్‌స రాజు ప్రశ్నించారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలోని 13 జిలాల్లో  ఎక్కడైనా విగ్రహాల ఏర్పాటుకు స్వాగతిస్తోందన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి వనం ఏర్పాటకు రూ.200కోట్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమలు చేసి 40 శాతం మేర పనులు పూర్తి చేసిందన్నారు.


రాజకీయ భవిష్యత్తు కోసం అమరావతిలోని తాటికొండ ప్రాంతంలో అంబేడ్కర్‌ స్మృతివనాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బడుగు, బలహీన వర్గాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత డొక్క మాణిక్యంపై ఉందన్నారు. పేద రైతుల భూములను లాక్కుంటే ఎం తటి పోరాటాలకైనా టీడీపీ సిద్ధమన్నారు. సమావేశం లో ఎస్సీ సెల్‌ నాయకులు కొల్లాపురప్ప, మల్లిపల్లి నారాయణ, ఆర్‌కే రాజు, మల్లేష్‌, గోవిందు, రంగప్ప, వన్నూర్‌స్వామి, చౌడప్ప, పాతన్న, గురుమూర్తి పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-14T11:20:04+05:30 IST