Abn logo
Sep 22 2021 @ 14:54PM

ఏకపక్షంగా ఎన్నికలను మార్చుకున్నారు: ఎంఎస్ రాజు

అమరావతి: నామినేషన్ వేసేవాళ్లను బెదిరిస్తూ, అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలను మార్చుకుందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరుగుతుంటే టీడీపీ ఆ ఎన్నికలను బహిష్కరించిందన్నారు. పోలీసుల్ని పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా పెట్టారని విమర్శించారు. సీఎం జగన్ రెండున్నర ఏళ్లుగా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని,  చేసిందేమీలేదన్నారు. జగన్ కుటుంబమే ఆయనను బహిష్కరించిందన్నారు. దాడికి వచ్చిన వ్యక్తిని కాపాడటానికి డీఐజీ ప్రెస్ మీట్ పెట్టాల్సి రావడం దౌర్భాగ్యమన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ప్రజలకు కనిపిస్తున్నాయి.. పోలీసులకు మాత్రం కనిపించడంలేదని విమర్శించారు. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు కళ్లకు గంతలు కట్టుకొని ఉన్నారన్నారు. ప్రజలే ప్రజాక్షేత్రంలో మంత్రి కొడాలి నానీకి దేహశుద్ధి చేస్తారని ఎంఎస్ రాజు అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption