Advertisement
Advertisement
Abn logo
Advertisement

సుబ్బారాయుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

మోపిదేవి, నవంబరు 26 : మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబులు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలుపోసి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. ఈవో లీలాకుమార్‌ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు రోజా, రమేష్‌బాబులకు అందించారు. అవనిగడ్డ డీఎస్పీ మెహబూబ్‌ బాషా ఆధ్వర్యంలో సీఐ బి.బి.రవికుమార్‌, ఎస్సై మురళీకృష్ణ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement