Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 6: నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిమ్మ మార్కెట్‌ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో నిమ్మ ధరలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కిలో నిమ్మకాయలకు రూ. 5 మాత్రమే ధర రావడంతో రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ధర లేక రైతులకు కోత కూలీ ఖర్చులు కూడా రాక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  నిమ్మ రైతులను సమీకరించి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బొడ్డు రాంబాబు, బోడిక రామచంద్రరావు, నిమ్మ వర్తక సంఘం అధ్యక్షుడు శీలం పూర్ణజగన్నాధరావు, ఈడా సత్యనారాయణ, యర్రా సత్యనారాయణ, రై తులు డి.సూర్యచంద్రం, శీలం దుర్గారావు, వి.సుబ్బారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement