ప్రవేశపరీక్ష లేకుండా ఎంటెక్‌ అడ్మిషన్లు: వీఐటీ వర్సిటీ చాన్సలర్‌

ABN , First Publish Date - 2020-05-30T17:16:39+05:30 IST

ప్రవేశపరీక్ష లేకుండా ఎంటెక్‌ అడ్మిషన్లు: వీఐటీ వర్సిటీ చాన్సలర్‌

ప్రవేశపరీక్ష లేకుండా ఎంటెక్‌ అడ్మిషన్లు: వీఐటీ వర్సిటీ చాన్సలర్‌

 వేలూరు: ప్రవేశపరీక్ష లేకుండా ఎంటెక్‌ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు వీఐటీ వర్సిటీ చాన్సలర్‌ విశ్వనాథన్‌ తెలిపారు. విలేఖరులతో ఆయన మాట్లాడుతూ వేలూరు, చెన్నై, ఆంధ్ర, భోపాల్‌లోని కళాశాలల్లో 23 రకాల ఎంటెక్‌ కోర్సులను వర్సిటీ అందిస్తోందని చెప్పారు. ఏటా ఎంటెక్‌, ఎంసీఏ కోర్సుల అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని,  అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రవేశపరీక్ష లేకుండా యూజీ డిగ్రీలో పొందిన ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. వర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా జూన్‌ 20వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తులు పొందాలన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ చేపట్టి, ఆగస్టు మూడు నుంచి తరగతులు ప్రారంభి స్తామని వెల్లడించారు. అలాగే, ప్లస్‌ టూ ముగించిన విద్యార్థులు వీఐటీ ఎంట్రెన్స్‌ పరీక్ష లేకుండా నేరుగా ఐదేళ్ల ఎంటెక్‌, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 15వ తేదీలోపు దరఖాస్తులివ్వాలని చాన్సలర్‌ తెలిపారు.

Updated Date - 2020-05-30T17:16:39+05:30 IST