ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T06:01:57+05:30 IST

ముఖ్యమంత్రి హామీ మేరకు నగర పాలకసంస్థ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌- టౌన్‌ప్లానింగ్‌, శానిటేషన్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు డిమాండ్‌ చేశారు.

ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ సభ్యులు

కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికుల ధర్నా

గుంటూరు(తూర్పు), డిసెంబరు 3: ముఖ్యమంత్రి హామీ మేరకు నగర పాలకసంస్థ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌- టౌన్‌ప్లానింగ్‌, శానిటేషన్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. అధికారం చేపట్టిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీని విస్మరించి ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ అనే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసి కార్మికులను రోడ్డున పడేశారన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వహించినందుకు ప్రభుత్వం ఇస్తానన్న అలవెన్సులను కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు సోమిశంకర్‌, బందెల రవికుమార్‌, దండా లక్ష్మీనారాయణ, ముత్యాలరావు, యాకోబు, ఉదయ్‌, శ్రీనివాసరావు, ఎలిషారావు, కార్మికులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T06:01:57+05:30 IST