Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులపై మట్టి మాఫియా దాడి

పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు 

కోదాడరూరల్‌, డిసెంబరు 3: మ ట్టి మాఫియా రైతులపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని కాపుగల్లు గ్రామంలో శు క్రవారం చోటుచేసుకుంది. అధికారులు, గ్రామస్థులు తెలిపి న వివరాల ప్రకా రం....కాపుగల్లు రెవెన్యూ పరిధిలో 292 సర్వేలో ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు ఏడు ఎకరాలకు పైగా మెగా పల్లె ప్రకృతి వనానికి కేటాయించారు. ఇటీవలే ఈ భూమిని రెవెన్యూ నుంచి కాపుగల్లు గ్రామపంచాయతీకి కేటాయించారు. ఆ భూమిని చదును చేసే పేరుతో ఒక ఎక్స్‌కవేటర్‌, 40 టిప్పర్లతో కోదాడలోని ప్లాట్లలోని వెంచర్లకు పెద్దఎత్తున మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పక్క పొలాల రైతులు, గ్రామస్థులు ముత్తవరపు మురళి, అన్నబత్తుల సూరి, కాసాని రామారావు, ముత్తవరపు వీరయ్య, రేవూరి వెంకటాచారి, వెంకట్రామారావు, మరికొంత మంది మట్టి తవ్వకాలను అడ్డుకున్నా రు. తహసీల్దార్‌, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి ఆర్‌ఐ కల్యాణి చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. 292 సర్వే నెంబర్‌లో ఐదెకరాలకు పై గా ప్రభుత్వ భూమిని మెగా పల్లెప్రకృతి వనానికి కేటాయించామని, ఈ భూమిలో గుట్టలు ఉన్నాయని, వాటిని ఎక్స్‌కవేటర్‌తో చదును చేసుకోవాలి తప్ప మట్టిని తరలించవద్దని సూచించారు. గ్రామస్థులు, రైతుల ఫిర్యాదు మేరకు మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్‌ చేస్తున్నట్లు ఆర్‌ఐ తెలిపారు. దీంతో మట్టి వ్యాపారి బత్తుల గోపాల్‌రెడ్డి, మరికొంత మందితో కలిసి ముత్తవరపు మురళి, అన్నబత్తుల సూరిలపై దాడి చేశారు. ఆర్‌ఐ ఫిర్యాదు మేరకు పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకుని మట్టి ని తరలిస్తున్న టిప్పర్‌ను స్టేషనకు తరలించారు. రైతులు అన్నబత్తుల సూరి, మురళి తమపై దాడి చేసిన గోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రూరల్‌ పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. నెల రోజులుగా కాపుగల్లు ప్రాంతంలో మట్టి తరలిస్తున్నారని, తాము అడ్డుకున్నందుకే దాడి చేశారని ఆరోపించారు. ఇందులో గ్రామ సర్పంచతో పాటు అతని అనుచరులు కూడా ఉన్నారని వారు పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Advertisement
Advertisement