Abn logo
Sep 26 2021 @ 23:26PM

ముదిరాజ్‌లకు కమ్యూనిటీ భవనాలు నిర్మించాలి

రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన గంపల చిరంజీవికి నియామక పత్రం అందిస్తున్న రఘురామ్‌ ముదిరాజ్‌

ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామ్‌

నెల్లూరు (వీఆర్సీ), సెప్టెంబరు 26 : రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ముదిరాజ్‌ కులాలకు కమ్యూనిటీ భవనాలు, విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కనకట్ల రఘురామ్‌ ముదిరాజ్‌  కోరారు. నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం ముదిరాజ్‌ ఉద్యోగుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా రఘురామ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముదిరాజ్‌లు సమాజంలో అట్టడుగున ఉన్నారన్నారు. నేటికీ గ్రామాల్లో కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నార న్నారు. ఎక్కువ శాతం జనాభా మత్స్యకార వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ముదిరాజ్‌ల కు ప్రభుత్వ పథకాలు అందడంలేదని, వారిని మత్స్యకారులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉద్యోగ సంఘం రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గంపల చిరంజీవి, జిల్లా అధ్యక్షుడిగా బీ శ్రీనివాసులును నియమించారు. పూర్తి స్థాయి కమిటీని త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందల నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండలరావు, సురేష్‌, శ్రీహరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.