మనసు దోచిన మహిళల సంక్రాంతి ముగ్గులు

ABN , First Publish Date - 2022-01-15T20:48:51+05:30 IST

సంక్రాంతి పండగ అనగానే పిల్లలు పెద్దలు గాలి పటాలు ఎగుర వేయడం పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే మహిళలు, యువతులు మాత్రం ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులను తీర్చిదిద్దుతారు.

మనసు దోచిన మహిళల సంక్రాంతి ముగ్గులు

హైదరాబాద్: సంక్రాంతి పండగ అనగానే పిల్లలు పెద్దలు గాలి పటాలు ఎగుర వేయడం పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే మహిళలు, యువతులు మాత్రం ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులను తీర్చిదిద్దుతారు. మహిళలకు ముగ్గుల పట్ల ఆసక్తిని మరింత పెంచడానికి వారిని మరింత ప్రోత్సహించడానికి సికింద్రాబాద్ భోలక్ పూర్ లోవున్న కృష్ణా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగు రంగు ముగ్గుల పోటీలు ఘనంగాజరిగాయి. దాదాపు వంద మంది మహిళలు, యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ముగ్గురు జడ్జిలతో కూడా ప్యానెల్ వీటిని పరిశీలించిందని కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి. అశోక్ కుమార్ తెలిపారు. విద్యారంగంలో విశేష సేవలు చేస్తున్న మహిళలు సుచిత కులకర్ణి, కేతకి కొత్లికర్ , నందిని ఆర్. పెన్నా తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. కాలనీ అంతా కలియ తిరిగి మహిళలు వేసిన ముగ్గులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు వేసిన ముగ్గులు చాలా బాగున్నాయని, కొన్ని ముగ్గులు వివిధ థీమ్ లతో వేయడం మరింత సంతోషం కలిగించిందన్నారు. 


ముగ్గుల వేయడంలో మహిళల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు వారు తీసుకున్న థీమ్, కలర్స్ ఎంపిక, డిజైన్, చుక్కలు, సైజులను ప్రామాణికంగా తీసుకుని ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలను ముగ్గులు వేయడంపై ఆసక్తపి పెంపొందించడంతోపాటు, సంప్రదాయాలను మర్చిపోకుండా ఇలాంటి పోటీలను నిర్వహించడం వల్ల వారిలో మరింత ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధమ, ద్వితీయ, త`తీయ బహుమతులతో పాటు కన్సొలేషన్ బహుమతులను అందజేయనున్నట్టు తెలిపారు. ఈవేడుకల్లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేశ్ సుబేదార్, జాయింట్ సెక్రటరీ జి.రమేశ్, కోశాధికారి సుబ్రహ్మణ్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిష్టయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మున్నాబాయ్,  సీమా సుబేదార్, రాజశేఖర్, రఘునాధ్ రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-15T20:48:51+05:30 IST