ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-12-04T23:35:30+05:30 IST

కరోనా బారినపడిన ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ కరోనా నుంచి కోలుకుంటున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌ (బీబీఎల్)లో

ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్‌కు కరోనా

క్వీన్స్‌లాండ్: కరోనా బారినపడిన ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ కరోనా నుంచి కోలుకుంటున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌ (బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రెహ్మాన్ క్వీన్స్‌లాండ్‌ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న సమయంలో కరోనా బారినపడినట్టు నిర్ధారణ అయింది. లీగ్‌లో పాల్గొనేందుకు ముజీబుర్ గత వారం కాబూల్ నుంచి ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ చేరుకున్నాడు. వారం రోజులపాటు క్వారంటైన్ తప్పనిసరి కావడంతో హోటల్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. క్వీన్స్‌లాండ్ హెల్త్ అధికారుల క్లియరెన్స్ లభించే వరకు ముజీబుర్ హోటల్‌కే పరిమితం కానున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న బీబీఎల్‌ 10వ ఎడిషన్‌‌లో రెహ్మాన్ బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆటగాళ్లు, సిబ్బంది ఆరోగ్యం, భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్స్ హెడ్ అలిస్టర్ డాబ్సన్ తెలిపారు. ఈ నెల 10న బిగ్‌బాష్ లీగ్ ప్రారంభం కానుండగా, జనవరి 26న ఫైనల్స్ జరగనుంది.  


Updated Date - 2020-12-04T23:35:30+05:30 IST