మళ్లీ ముకేశే ఆసియా నం.1
ABN , First Publish Date - 2021-02-27T09:22:34+05:30 IST
ఆసియా కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. రెండు నెలల క్రితం ముకేశ్‌ను వెనక్కి నెట్టి నం.1గా ఎదిగిన చైనా పారిశ్రామికవేత్త జాంగ్ షాన్షాన్ ఆస్తి ఈ వారంలో 22 క్షీణించి 7,660 కోట్ల డాలర్లకు పడిపోయింది.
ముంబై: ఆసియా కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. రెండు నెలల క్రితం ముకేశ్‌ను వెనక్కి నెట్టి నం.1గా ఎదిగిన చైనా పారిశ్రామికవేత్త జాంగ్ షాన్షాన్ ఆస్తి ఈ వారంలో 22 క్షీణించి 7,660 కోట్ల డాలర్లకు పడిపోయింది. అంబానీ సంపద 8,000 కోట్ల డాలర్ల కంటే తగ్గడంతో ఆయన రెండో స్థానానికి జారుకున్నారు. ఈ వారం మన మార్కెట్లు భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, రిలయన్స్ షేర్లపై అంతగా ప్రభావం చూపకపోవడం అంబానీకి కలిసివచ్చింది. రెండేళ్ల క్రితం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ను వెనక్కి నెట్టి అంబానీ తొలిసారిగా ఆసియా కుబేర కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.