ముల్లంగి కోఫ్తా

ABN , First Publish Date - 2020-12-19T19:01:00+05:30 IST

తెల్ల ముల్లంగి - అరకేజీ, కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌, వేరుసెనగలు - అర టేబుల్‌స్పూన్‌, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు

ముల్లంగి కోఫ్తా

కావలసినవి: తెల్ల ముల్లంగి - అరకేజీ, కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌, వేరుసెనగలు - అర టేబుల్‌స్పూన్‌, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


గ్రేవీ కోసం : ఎండుమిర్చి - నాలుగు, వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, పెరుగు - 125 ఎంఎల్‌, నూనె - సరిపడా, గరంమసాలా - ఒక టీస్పూన్‌, యాలకులు - నాలుగు. 


తయారీ విధానం: ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత ముల్లంగిని మెత్తగా ఉడికించి, నీళ్లు తీసేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, వేరుసెనగలు, సెనగపిండి, గరంమసాలా, ఎండుమిర్చి వేసి గ్రైండ్‌ చేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత కొద్దిగా ఉప్పు వేసి, ముల్లంగితో కలియబెట్టాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుంటూ నూనెలో వేగించుకుంటూ పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం మిక్సీలో ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆ మిశ్రమాన్ని వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేయాలి. తరువాత పెరుగు వేసి గరంమసాలా, యాలకులు, తరిగిన అల్లం వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న కోఫ్తాలు వేయాలి. కాసేపు ఉడికించి దింపాలి.


Updated Date - 2020-12-19T19:01:00+05:30 IST