Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 1 2021 @ 07:48AM

Shimla: కుప్పకూలిన బహుళ అంతస్థుల భవనం..వీడియో వైరల్

సిమ్లా: సిమ్లా నగరంలోని కాచిఘటీ ప్రాంతంలో ఎనిమిది అంతస్తుల భవనం ఒక్క సారిగా కుప్పకూలిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతో బహుళ అంతస్తుల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. భవనం పగుళ్లతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.భవనం కూలిపోవడంతో దాని శిథిలాలు సమీపంలోని ఇళ్లను ఢీకొన్నాయి. దీంతో కూలిన భవనం చుట్టుపక్కల ఉన్న 12 భవనాలు దెబ్బతిన్నాయి. కాచి ఘాటీ ఏరియాలో కొండలపై నిర్మించిన భవనాలు భారీవర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భవనాలు ఊగిపోయాయి.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. భవనం కుప్పకూలిన ఘటనతో సిమ్లాలో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement