Advertisement
Advertisement
Abn logo
Advertisement

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం !

ఇండియానా పోలిస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా పోలిస్‌లో గురువారం అర్ధరాత్రి(యూఎస్ కాలమానం ప్రకారం) కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇండియానా పోలిస్‌ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఫెడెక్స్‌ కొరియర్‌ సంస్థ పార్కింగ్ వద్ద ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది మరణించారనే దానిపై స్పష్టత లేదు. పలువురు గాయపడగా, కాల్పులకు తెగబడిన దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండియానా పోలిస్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ అధికారిణి జెనే కుక్ మాట్లాడుతూ.. ఈ కాల్పుల్లో ఎంత మంది మృతి చెందారో ఇంకా తెలియదన్నారు. చాలా మంది గాయపడి ఉండొచ్చని, దాడికి పాల్పడిన సాయుధుడు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు తాము నమ్ముతున్నామని కుక్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు ఆమె చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement