Abn logo
Jul 24 2021 @ 00:52AM

రైల్వే స్టేడియంలో మల్టీజిమ్‌ ప్రారంభం

జిమ్‌ను ప్రారంభించి అథ్లెట్లతో మాట్లాడుతున్న జేకే జైన్‌

రైల్వే స్టేడియంలో మల్టీజిమ్‌ ప్రారంభం 

భవానీపురం, జూలై 23: విజయవాడ రైల్వే స్టేడియంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సికింద్రాబాద్‌ ఆధ్వర్యంలో స్పాన్సర్‌ చేసిన 12వ మల్టీజిమ్‌ను  అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ జేకే జైన్‌ శుక్రవారం ప్రారంభించారు. ఇంటర్నేషనల్‌, నేషనల్‌ అథ్లెట్స్‌ సౌమ్య, జి. కార్తీక, అఖిలతో జైన్‌ ముఖాముఖి మాట్లాడారు. ఈ జిమ్‌ తమ లాంటి క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. జైన్‌ను డివిజనల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ కె.శ్రీనివాస్‌, మాజీ కబడ్డీ ప్లేయర్‌ ఎన్‌. అర్జునరావులు సత్కరించారు.