Advertisement
Advertisement
Abn logo
Advertisement

జలదిగ్బంధంలో ములుముడికి

నెల్లూరురూరల్‌, నవంబరు 30 : నెల్లూరురూరల్‌లోని ములుముడి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇటీవల  వచ్చిన భారీ వర్షాలకు గ్రామానికి చుట్టుపక్కల వరద చేరుకొంది. దాంతో ఆ గ్రామంలోని ప్రజలు బయటకు రాలేని పరిస్థితి.  ములుముడి నుంచి తాటిపర్తి వైపు వెళ్లేందుకు గ్రామానికి ఆనుకుని కలుజు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిని దాటుకుని నడిచి కూడా వెళ్లలేరు. అటు దేవరపాళెం వైపు కూడా రోడ్డు నీట మునగడంతో ప్రయాణ మార్గం పూర్తిగా ప్రమాదకరంగా మారింది. రెండు రోజులుగా గ్రామంలోని వారంతా బయటకు,  బయట నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లలేని దుస్థితి. ప్రజల ఆహారానికి, పశువుల మేతకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. కొందరు పశువుల పెంపకందారులు నరసింహపురం వైపు పారుతున్న వరద ప్రవాహంలోనే జీవాలను ఊరు దాటించే ప్రయత్నాలు చేస్తున్నారు. నరసింహపురంలోని నిరాశ్రయులకు రెడ్‌ క్రాస్‌ నుంచి తాత్కలిక గుడెసెలకు సామాగ్రిని అందించారు. 

Advertisement
Advertisement