Advertisement
Advertisement
Abn logo
Advertisement

51 ఏళ్ల వయసులో లక్షలు సంపాదిస్తున్న మహిళ.. ఒక్క ఆలోచనే ఆమె లైఫ్‌ను మార్చేసిందిలా..!

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 51ఏళ్లు. నెలనెలా లక్షలాది రూపాయలను సంపాదిస్తోంది. అంతేకాకుండా లేటు వయసులో ఎంతో మందికి ఉపాధి కూడా చూపి అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. వ్యాపారంలోకి అడుగు పెట్టాలనే ఆలోచనలు చేస్తున్న ఎంతో మంది యువతకు  ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె సక్సెస్ స్టోరీని ఒకసారి పరిశీలిస్తే..


కమల్జిత్(51) పుట్టి, పెరిగిందంతా పంజాబ్‌లోనే. వివాహం అనంతరం ఆమె తన భర్తతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నారు. కొవిడ్ బాధితుల్లో ఈమె కూడా ఒకరు. 2020లో మహమ్మారి బారినపడి 4-5నెలలపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. సమాజానికి ఏదైనా మంచి చేయాలని భావించారు. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకున్నారు. స్థానికంగా దొరికే స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే కమల్జిత్ దగ్గర నెయ్యి తీసుకెళ్లిన ఇరుగు పొరుగు వాళ్లు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. స్వచ్ఛమైన నెయ్యితో వ్యాపారం మొదలుపెట్టమని సూచించారు. దీంతో ఎటువంటి కల్తీలేని నెయ్యిని ప్రజలకు అందించాలని ఆమె డిసైడ్ అయ్యారు. 


ఈ క్రమంలోనే కొడుకు సహకారంతో 2020 ఏడాది చివరిలో కిమ్మూస్ కిచెన్ పేరుతో ఆమె స్టార్టప్‌ను ప్రారంభించారు. ముంబైలో దొరికే పాల ద్వారా నెయ్యిని తయారు చేసి, అమ్మడం ప్రారంభించారు. అయితే.. పాలలో కల్తీ కారణంగా నెయ్యి స్వచ్ఛత బాగోవడంలేదని గుర్తించిన ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరిగి పంజాబ్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఉన్నవాటికి తోడు.. మరికొన్ని గేదలు, ఆవులను కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న కొంత మంది మహిళలను పనిలో పెట్టుకుని, స్వచ్ఛమైన నెయ్యిని దేశీయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో నేర్పించారు. అనంతరం తిరిగి ముంబై చేరుకుని.. తన వ్యాపారాన్ని విస్తరించారు. ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందించుకున్నారు. సోషల్ మీడియా‌లో తమ స్టార్టప్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. అంతే.. దేశ నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. విదేశాలకు కూడా ఆమె నెయ్యిని ఎగుమతి చేస్తున్నారు. వేలాది ఆర్డర్లు వస్తుండటంతో నెలకు సుమారు రూ.20లక్షలపైనే సంపాదిస్తున్నారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement