Jun 11 2021 @ 23:20PM

ముంబైలో ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణ!

‘‘నేను చేస్తున్న చిత్రాల్లో ఎగ్జైటింగ్‌ సినిమా ‘ఆదిపురుష్‌’. ఇందులో నటించడం ఓ విభిన్న అనుభూతి. ప్రతిక్షణం ఆస్వాదిస్తూ సినిమా చేస్తున్నా’’ అని కృతీ సనన్‌ పేర్కొన్నారు.


‘ఓం రౌత్‌... త్వరలో మనం చిత్రీకరణ మొదలుపెడదామా?’ - ఇన్‌స్టాలో కృతీ సనన్‌ అడిగారు. ‘త్వరలో... అతి త్వరలో మొదలుపెడదాం. లెట్స్‌ గో!’ అని ఓం రౌత్‌ సమాధానం ఇచ్చారు. వీళ్లిద్దరి సంభాషణ ‘ఆదిపురుష్‌’ గురించే! ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. కరోనా రెండో దశ   విజృంభణ వల్ల చిత్రీకరణ ఆపేశారు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.


కొత్త షెడ్యూల్‌ ముంబైలో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రభు రామ్‌ పాత్రలో ప్రభాస్‌, ఆయనకు జంటగా సీత పాత్రలో కృతి సనన్‌, లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఇన్‌స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కృతీ ససన్‌ ‘‘మహేశ్‌బాబుతో మళ్లీ నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.