పది ఓవర్లలో ముంబై స్కోరు ఎంతంటే..

ABN , First Publish Date - 2021-04-10T01:54:20+05:30 IST

తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజృంభించి ఆడుతోంది. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(19; 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) నిరాశపరిచినా, మరో ఓపెనర్ క్రిస్ లిన్(41 నాటౌట్) మాత్రం చెలరేగి..

పది ఓవర్లలో ముంబై స్కోరు ఎంతంటే..

చెన్నై: తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజృంభించి ఆడుతోంది. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(19; 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) నిరాశపరిచినా, మరో ఓపెనర్ క్రిస్ లిన్(41 నాటౌట్) మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. అతడికి సూర్యకుమార్ యాదవ్(24 నాటౌట్) అద్భుత సహకారం అందిస్తున్నాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. కాగా.. మొదట ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మన్‌ను బెంగళూరు బౌలర్లు మహ్మద్ సిరాజ్, కైల్ జేమీసన్‌లు అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో మొదటి 3-4 ఓవర్లలో ముంబై జట్టు కనీసం 15 పరుగులు కూడా దాటలేదు. కానీ, ఆ తర్వాత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, షాదాబ్ నదీమ్, హర్షల్ పటేల్, డానియల్ క్రిస్టియన్‌లు ధారాళంగా పరుగులివ్వడంతో ముంబై స్కోరు బ్యాట్స్‌మన్ పరుగుల వరద పారించారు.

Updated Date - 2021-04-10T01:54:20+05:30 IST