చెలరేగిన కమిన్స్.. ముంబై ఎదుట ఓ మాదిరి విజయ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-17T02:54:28+05:30 IST

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు

చెలరేగిన కమిన్స్.. ముంబై ఎదుట ఓ మాదిరి విజయ లక్ష్యం

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు కలిసి రాలేదు. 18 పరుగుల వద్ద ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (7) అవుటయ్యాడు. క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన నితీశ్ రాణా 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 11 పరుగుల వ్యవధిలో శుభ్‌మన్ గిల్ (21) కూడా పెవిలియన్ చేరడంతో కోల్‌కతాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 


మరోవైపు, ముంబై బౌలర్లు పట్టు బిగించడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. దినేశ్ కార్తీక్ (4), ఆండ్రూ రస్సెల్ (12) కూడా క్రీజులోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరడంతో 120 పరుగులు దాటితేనే గొప్ప అనుకున్నారు. అయితే, కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన మోర్గాన్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు పెంచేందుకు ప్రయత్నించాడు. 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. చివర్లో పాట్ కమిన్స్ చిచ్చరపిడుగుల్లే చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేయడంతో కోల్‌కతా 148 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, కౌల్టర్ నౌల్, బుమ్రాలు చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-10-17T02:54:28+05:30 IST