బిలియనీర్ల అడ్డా ముంబై

ABN , First Publish Date - 2021-04-10T06:35:54+05:30 IST

ఆర్థిక రాజధాని ముంబై.. దేశ సంపన్నుల అడ్డాగా మారింది. ఈ ఏడాదికి గాను ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌ నుంచి 140 మందికి చోటు దక్కింది

బిలియనీర్ల అడ్డా ముంబై

అధిక మంది కుబేరులు నివసిస్తున్న

ప్రపంచ నగరాల జాబితాలో చోటు


ఆర్థిక రాజధాని ముంబై.. దేశ సంపన్నుల అడ్డాగా మారింది. ఈ ఏడాదికి గాను ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌ నుంచి 140 మందికి చోటు దక్కింది. అందులో 48 మంది ముంబైలోనే నివసిస్తున్నట్లు  వెల్లడించింది. అధిక మంది బిలియనీర్లున్న ప్రపంచ టాప్‌-10 నగరాల్లో ముంబై 8వ స్థానంలో ఉంది. చైనా రాజధాని బీజింగ్‌ 100 మంది బిలియనీర్లతో వరల్డ్‌ నం.1 నగరంగా నిలిచింది. అంతేకాదు, టాప్‌ టెన్‌లోని నాలు గు నగరాలు చైనావే. కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.7,400 కోట్లు) ఆస్తి కలిగిన వారికి ఫోర్బ్స్‌ ఈ జాబితాలో చోటు కల్పించింది. 

Updated Date - 2021-04-10T06:35:54+05:30 IST