ముంబైలో యాచకులు, వీధి వ్యాపారులకు కొవిడ్ టీకాలు

ABN , First Publish Date - 2021-06-17T14:27:48+05:30 IST

ముంబై నగరంలోని జైన దేవాలయంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేని పేదలు...

ముంబైలో యాచకులు, వీధి వ్యాపారులకు కొవిడ్ టీకాలు

ముంబై (మహారాష్ట్ర): ముంబై నగరంలోని జైన దేవాలయంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేని పేదలు, యాచకులు, వీధివ్యాపారులకు కొవిడ్ టీకాలు వేశారు. ఆధార్ గుర్తింపు లేని యాచకులకు మానవతా దృక్పథంతో కొవిడ్ టీకాలు వేస్తున్నామని వ్యాక్సినేషన్ ఇన్ చార్జి జే షా చెప్పారు. కొవిడ్ టీకాలపై అవగాహన కల్పించి వైద్యుల సహకారంతో టీకాలు వేస్తున్నామని షా చెప్పారు. తనకు ఎలాంటి గుర్తింపుకార్డు లేకున్నా కొవిడ్ టీకా వేశారని అల్కా అనే మహిళ చెప్పారు. ఉచితంగా జైన దేవాలయంలో టీకాలు వేయడం అభినందనీయమని ఆషా అనే మహిళ చెప్పారు. 

Updated Date - 2021-06-17T14:27:48+05:30 IST