నీకు ఛాన్సులు రావాలంటే నేను చెప్పింది చెయ్.. సినీ నటికి వేధింపులు.. నిర్మాత సోదరుడు అరెస్ట్..!

‘క్యాస్టింగ్ కౌచ్’.. ఈ మాట గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది. ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తారల్లో చాలామంది కెరీర్ ప్రారంభంలో దీనితో ఇబ్బంది పడ్డవారే. ఇటీవలి కాలంలో ఎంతోమంది నటీమణులు ‘మీ టూ’ అంటూ తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి బయటి ప్రపంచానికి తెలియజేశారు. అయినప్పటికీ ఎంతో మంది నవతారలు ఇంకా ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతూనే ఉన్నారు.


సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటే తనతో గడపాలంటూ ఓ నిర్మాత సోదరుడు ఓ స్ట్రగ్లింగ్ నటిపై వేధింపులకు పాల్పడ్డాడు. నీకు మంచి అవకాశాలు రావాలంటే తనకు సహకరించాలని హెచ్చరించడమే కాకుండా.. ఆమె పర్మిషన్ లేకుండా ఎక్కడాపడితే అక్కడ తడిమాడు. దీంతో ఆ నటి ఆ 35 ఏళ్ల నిర్మాత సోదరుడిపై ఆరే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. మరాఠీ సిరియల్స్‌లో నటిస్తున్న ఆ యాక్ట్రెస్ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

Advertisement

Bollywoodమరిన్ని...