Abn logo
Aug 2 2020 @ 16:54PM

ముంబై పోలీసులను నమ్మలేం.. సుశాంత్ కేసుపై తనుశ్రీ కామెంట్స్!

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసుపై నటి తనుశ్రీ దత్తా షాకింగ్ కామెంట్స్ చేశారు. మామూలుగా ఇటువంటి కేసుల్లో ముంబై పోలీసులు చురుగ్గా స్పందిస్తారని చెప్పిన ఆమె.. ఇటువంటి కేసుల్లో ముంబై పోలీసులు నిందితులతోనే చేతులు కలుపుతారని ఆరోపించారు. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా కేసులు మూసేస్తారని చెప్పారు. ‘పెద్ద పెద్ద వాళ్లను పిలిపించి స్టేట్‌మెంట్లు రికార్డు చేయడం మొత్తం ఓ షో. ప్రస్తుతం ఈ విషయం బర్నింగ్ మ్యాటర్ కాబట్టి ప్రజలను మాయ చేయడానికే ఇలాంటి పనులు చేస్తారు’ అని పోలీసులపై ఆమె ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement
Advertisement