టైగర్ ష్రాఫ్ - దిశాకి షాకిచ్చిన ముంబై పోలీసులు

టైగర్ ష్రాఫ్ - దిశాకి ముంబై పోలీసులు షాకిచ్చారు. ఇటీవల వీరిద్దరు ముంబై బాంద్రా వీధుల్లో కార్‌లో షికారు కొడుతు పోలీసుల కంటపడ్డారు. విధుల్లో భాగంగా తనిఖీ నిర్వహిస్తుండగా దిశా పటానీ కార్ ముందు కూచుని కనిపించింది. ముంబై మీడియా సమాచారం ప్రకారం.. జిమ్ నుంచి బయటకు వచ్చిన వీరిద్దరూ అలా డ్రైవ్‌ను ఎంజాయ్ చేసేందుకు వెళ్లారు. టైగర్ ష్రాఫ్ వెనుక సీట్లో కూర్చుని ఉండగా దిశా ముందు కూర్చున్నారు. ముంబై పోలీసులు బ్యాండ్ స్టాండ్‌లో రెండవ రౌండ్ తనిఖీలు నిర్వహిస్తూ వీరిని ఆపారట. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పోలీసులు కేసు రిజిస్టర్‌ చేసినట్టు తెలుస్తోంది. సరైన కారణం లేకుండా బయటకు రావడం, లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్న పోలీసులు వారిపై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారని సమాచారం. కాగా దిశా పటాని ప్రస్తుతం 'ఏక్ విలన్ రిటర్న్స్'లో నటిస్తుండగా, టైగర్ ష్రాఫ్ 'హీరోపంథి 2'లో నటిస్తున్నారు. 

Advertisement

Bollywoodమరిన్ని...