Abn logo
Jul 8 2020 @ 02:41AM

ముంబై పోలీసులు విభిన్నంగా..

మహేంద్రసింగ్‌ ధోనీ(ఎంఎస్‌డీ)కి ముంబై పోలీసులు వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్‌ మైదానం, దాని మధ్యలో వికెట్లు, బ్యాటు, బంతి.. వాటితో పాటు ‘ఎంఎ్‌సడీ.. మెయింటెయిన్‌ సోషల్‌ డిస్టెన్స్‌‘ అనే అక్షరాలతో కూడిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘కరోనాను జయించాలని, అందుకోసం ధోనీలా నాటౌట్‌గా ఉండాలనీ, వైరస్‌ను స్టంపవుట్‌ చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ..’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ కూడా ఉంచారు. ఇప్పుడీ ఫొటో నెట్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. 

Advertisement
Advertisement
Advertisement