యువతికి జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో...

ABN , First Publish Date - 2020-06-04T17:42:54+05:30 IST

మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన యువతికి కరోనా లక్షణాల అనుమానంతో హైదరాబాద్ తరలించగా...

యువతికి జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో...

కరోనా లక్షణాల అనుమానంతో ఆసుపత్రికి తరలించిన యువతికి నెగెటివ్

రామారెడ్డి(నిజామాబాద్ జిల్లా): మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన యువతికి కరోనా లక్షణాల అనుమానంతో హైదరాబాద్ తరలించగా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు కామారెడ్డి జిల్లా వైద్యశాఖ నోడల్ అధికారి శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఇటీవల మే 19న ముంబయి నుంచి పోసానిపేట గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. వచ్చిన నాటి నుంచి యువతి హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.


అయితే.. గత సోమవారం రాత్రి ఆ యువతికి జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వైద్య సిబ్బందికి తెలపడంతో వారు వెంటనే ఆమెను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను చూసి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో అక్కడ నుంచి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చిందని, గ్రామస్తులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కామారెడ్డి జిల్లా వైద్యశాఖ నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.

Updated Date - 2020-06-04T17:42:54+05:30 IST