Mumbai: Second Testలో కివీస్‎పై టీమిండియా ఘన విజయం

ABN , First Publish Date - 2021-12-06T16:03:17+05:30 IST

న్యూజిలాండ్‎తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‎లో భారత్ 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 140/5 తో ఆటను నాలుగో రోజు ప్రారంభించిన కివీస్ జట్టు

Mumbai: Second Testలో కివీస్‎పై టీమిండియా ఘన విజయం

ముంబై: అంతా అనుకున్నట్లే..జరిగింది. న్యూజిలాండ్‎తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‎లో భారత్ 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో విజయాన్ని చేజార్చుకున్న భారత్. రెండో టెస్టులో ప్రత్యర్థి కివీస్ జట్టుకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. 540 భారీ లక్ష్యాన్ని కివీస్ ముందుంచి సవాల్ విసిరింది. రెండో టెస్టు రెండవ ఇన్నింగ్స్‎లో 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మూడవ రోజే మ్యాచ్‎ను భారత్ వైపు తిప్పుకుంది.


భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆదివారం ఆట ఆఖరికి 140 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుని పీకల్లోతూ కష్టాల్లోపడింది. ఓవర్ నైట్ స్కోర్ 140/5 తో ఆటను నాలుగో రోజు ప్రారంభించిన కివీస్ జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా కుప్పకూలింది. నాల్గవ రోజు సోమవారం ఆట ప్రారంభమైన గంటలోపు తోక ముడిచింది. కేవలం 27 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. జయంత్ యాదవ్ స్పిన్ ధాటికి కుప్పకూలింది. జయంత్ 4 వికెట్లు తీయగా..అశ్విన్ చివరి వికెట్ తీసి భారత జట్టుకు విజయాన్నందించాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‎ను భారత్ జట్టు 1-0తేడాతో సిరీస్‎ను కైవసం చేసుకుంది.


తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా: 325 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ బ్యాటింగ్‎లో అగర్వాల్ 150 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్ ఎజాజ్ 10 వికెట్లు తీసి రికార్డ్ నమోదు చేశాడు. 


తొలి ఇన్నింగ్స్‎లో కివీస్ 62 పరుగులకే ఆలౌటైంది. భారత్ బౌలింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీసుకున్నాడు.


రెండో ఇన్నింగ్స్‎లో భారత్ ఏడు వికెట్లను కోల్పోయి 276 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసి న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఎజాజ్ రెండో ఇన్నింగ్స్‎లో కూడా 4 వికెట్లు తీశాడు. 


మొత్తం 14 వికెట్లను తీసి ఎజాజ్ కొత్త రికార్డ్ సృష్టించాడు.


ఇక రెండో ఇన్నింగ్స్‎లో న్యూజిలాండ్ 167 పరుగులకే ఆలౌటైంది. రవి చంద్రన్ అశ్విన్ 4, జయంత్ యాదవ్ 4, అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.

Updated Date - 2021-12-06T16:03:17+05:30 IST