Jun 3 2021 @ 17:04PM

మహారాష్ట్రలో సెక్స్‌ రాకెట్‌ కేసు!

కాస్టింగ్‌ కౌచ్‌, సెక్స్‌ రాకెట్‌ కేసులు సినిమా పరిశ్రమలకు కొత్తేమీ కాదు. తాజాగా  ఇలాంటి ఓ కేస్‌ వెలుగులోకి  వచ్చింది. దక్షిణాదిన హీరోయిన్లుగా నటించిన ఇద్దరు తారలు సెక్స్‌ రాకెట్‌ వివాదంలో బయటపడ్డారు. మహారాష్ట్ర, థానేలోని నౌపాడా ప్రాంతంలోని ఒక ప్లాట్‌లో బుధవారం ఇద్దరు మహిళలు  సెక్స్‌ రాకెట్‌ కేసులో నిందితులుగా దొరికారు. మొత్తం ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మోడల్స్‌గా తీర్చిదిద్దుతామని డబ్బు ఆశ చూపి వీరిని ఈ వృత్తిలోకి దింపారని పోలీసులు వెల్లడించారు.