Advertisement
Advertisement
Abn logo
Advertisement

Mumbai Test: ముగిసిన తొలి రోజు ఆట.. భారత్‌దే పైచేయి

ముంబై: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ప్రత్యర్థిపై పట్టు సాధించింది. టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తిచేసుకున్న మయాంక్ అగర్వాల్ 120, వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. శుభమన్ గిల్ 44 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులు చేయగా, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ డకౌట్ అయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. టీమిండియా కోల్పోయిన నాలుగు వికెట్లు అజాజ్ పటేల్ ఖాతాలోకే చేరడం గమనార్హం.

Advertisement
Advertisement