కోల్‎కతాపై ముంబై ఇండియన్స్ గెలుపు

ABN , First Publish Date - 2020-10-17T05:03:54+05:30 IST

ముంబై ఇండియన్స్‌ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్‎తో జరిగిన మ్యాచ్‎లో ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని...

కోల్‎కతాపై ముంబై ఇండియన్స్ గెలుపు

అబుదాబి: ముంబై ఇండియన్స్‌ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్‎తో జరిగిన మ్యాచ్‎లో ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ తిరుగులేని జైత్రయాత్ర కొనసాగుతోంది. అయితే.. కోల్‎కతా టీమ్ నిర్ధేశించిన 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ముంబై టీమ్. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్, డికాక్ జట్టుకు వికెట్ కోల్పోకుండా మంచి ఆరంభాన్ని అందిచారు. ముంబై బ్యాటింగ్‎లో డికాక్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78) రన్స్ చేయగా..రోహిత్ శర్మ (36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్, 35) పరుగులు చేశారు. దీంతో అప్పటికే ముంబై ఇండియన్స్ విజయం దాదాపు ఖరారైంది. ఇదే క్రమంలో రోహిత్ 35 పరుగుల వద్ద ఔట్ కాగా ..అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా వెంటనే 10 పరుగుల వద్ద వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన హార్థిక్ పాండ్య (11 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్ తో 21)రన్స్ చేసి మ్యాచ్‎ను ముగించాడు. దీంతో ముంబై రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొలిస్థానంలో కొనసాగుతోంది.


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ టీమ్‎లో కెప్టెన్ ను మార్చిన కానీ మ్యాచ్‎కు కలిసి రాలేదు. అయితే.. కోల్‎కతా బ్యాటింగ్ మాత్రం సరిగ్గా చేయలేకపోయింది. 61 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాలోపడింది. ఇదే తరుణంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మోర్గాన్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39)రన్స్ చేయగా.. తనకు తోడుగా కమిన్స్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53)పరుగులు చేసి..జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలింగింది.  దీంతో కోల్‎కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 148 రన్స్ చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, కౌల్టర్ నౌల్, బుమ్రాలు చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-10-17T05:03:54+05:30 IST