Abn logo
Sep 10 2021 @ 18:49PM

ముంబైలో మరో ‘నిర్భయ’.. అత్యాచారం చేసి, ఆపై..

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సభ్య సమాజం తలదించుకునే మరో ఘటన జరిగింది. ఓ మహిళపై పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆమె ప్రవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నగరంలోని సకినాక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మరో ‘నిర్భయ’ను తలపించింది. 32 ఏళ్ల బాధిత మహిళపై దారుణానికి తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. 


సకినాక ప్రాంతంలోని ఖైరాని రోడ్డులో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే డీసీపీ, అడిషనల్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉందని తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూముకు ఫోన్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళను ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. 

క్రైమ్ మరిన్ని...