Abn logo
Sep 15 2021 @ 11:23AM

నవ్వుతూ ఈడీ ముందుకు ముమైత్

హైదరాబాద్: నేడు ఈడీ విచారణకు నటి ముమైత్‌ఖాన్‌ హాజరైంది. నవ్వుతూ ఈడీ ముందుకు ముమైత్ వెళ్లడం గమనార్హం. డ్రగ్స్ కేసులో ముమైత్‌ఖాన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, కెల్విన్‌తో పరిచయాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. ముమైత్‌ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కెల్విన్‌కు బదిలీ అయినట్లు గుర్తించారు. కెల్విన్ నుంచి అధిక మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ విచారించనుంది.

తెలంగాణ మరిన్ని...