Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముమ్మరంగా వరి కోతలు

  పెరిగిన కూలిరేట్లు

 అందుబాటులో లేని మినుము, పెసర విత్తనాలు 

ఉయ్యూరు, డిసెంబరు 5 : మండలపరిధిలో వరికోతలు ఊపందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు అల్పపీడనం, వాయుగుండాలతో వాతావరణంలో మా ర్పులతో వేచి చూసిన రైతులు జవాద్‌ తుఫాన్‌ గండం తప్పిందన్న వాతావరణశాఖ సమాచారంతో  పొలాల్లో వరికోతలు ప్రారంభించారు. పంట కోత తరుణం దాటి  పోతున్నప్పటికి వర్షాలు, వాతావరణ మార్పులు కారణ ంగా భయపడి కోత ఆలస్యం చేశారు. కాగా జవాద్‌ తుఫాన్‌ బలహీన పడిందని, రాష్ట్రానికి ముప్పు తప్పిం దన్న ఉద్దేశంతో ఒక్కసారిగా కోత కోసేందుకు రైతులు ముందుకు రావడంతో కూలీ రేట్లు  పెరిగి పో యాయి. ఎకరకు కోతకు రూ. 6నుంచి 7 వేల వరకు, కోసినపైరు కట్టివేతకు రూ. 6 వేల వరకు కూలీ డిమాండ్‌ చేసు న్నారు. యంత్రంతో కోసేందుకు రూ. 3,500 వరకు తీసుకుంటున్నారు. మండల పరిధిలో 13 వేల ఎకరాల్లో వరిసాగు  చేయగా ఇప్పటివరకు 15 శాతం లోపే వరి కోతలు జరిగాయి. మరో పక్క కూలీల కొరతతో ఇతర జిల్లాల నుంచి వలస కూలీలను తీసుకువస్తున్నారు.

ఉంగుటూరు మండలంలో..

ఉంగుటూరు : మండలంలో  వరికోతలు ఊపం దుకున్నాయి. ఈఏడాది జులై నెలలో నాట్లువేసిన ము దురు వరిపొలాలు కోతకు రావడంతో రైతులు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో ఈ ఏడాది సుమారు 27వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు  వరి సాగుచేశారు. ఎంటీయూ 1061, 2077లో క్రాసింగ్‌, స్వర్ణలో క్రాసింగ్‌ వంటి రకాలను  సాగుచేశారు. నాట్లువేసిన నాటినుంచి వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడులు ఈఏడాది పెరగవచ్చని రైతులు అంచనా వేశారు. అయితే గతనెల గింజపాలుపోసుకొనేదశలో కురిసిన భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. పలుచోట్ల పైరు నేలపై  పడిపోయి, రెం డ్రోజులపాటు పొలాల్లో నీరునిలిచివుండటంతో అధికశాతం గింజలు తాలు, తప్పలుగా మారి దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూలీలు, యంత్రాలకు డిమాండ్‌

మండలంలో ఖరీఫ్‌ వరి కోతలు ఊపందుకున్న నేపధ్యంలో కూలీలకు, వరికోత మిషన్లకు డిమాండ్‌ ఏర్పడింది. నేలపై వాలకుండా వున్న పంటను కోసేందుకు వరికోతమిషన్‌కి గంటకు రూ. 3 వేలు, నేలవాలిన పంటను కోసేందుకు కూలీలకు ఎకరాకు రూ. 6వేలు రైతులు చెల్లిస్తున్నామని, ఈదామాషాన లెక్కిస్తే ఖర్చులన్నీ పోను చివరకు తమకు మిగిలేది అప్పులేనని కౌలురైతులు వాపోతున్నారు.

 అందని సబ్సిడీ విత్తనాలు

ఖరీఫ్‌ వరిమాగాణుల్లో రెండో పైరుగా వేసే అపరాల విత్తనాలు మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే మినుము, పెసర విత్తనాలను వరికోతల సమయంలో రైతులు పదును చూసి వరిమాగాణుల్లో విత్తుతారు. ఈ నేపథ్యంలో కోతలు ప్రారంభించకముందే అందుబాటులో ఉంచాల్సిన మినుము, పెసర విత్తనాలు కోతలు 20 శాతం మేర పూర్తయినా ఇంకా ప్రభుత్వం పూర్తిస్ధాయిలో సరఫరా చేయకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement