ముంపు ప్రాంతాల సమస్యకు పరిష్కారం చూపాలి

ABN , First Publish Date - 2021-12-01T03:09:18+05:30 IST

ఆత్మకూరు మున్సిపాలిటీ లో ముంపు ప్రాంతాలకు ఏర్పడుతున్న సమస్యలపై దృష్టి సారించాలి. పంటకాలువల ఆక్రమణలు తొల

ముంపు ప్రాంతాల సమస్యకు పరిష్కారం చూపాలి
మాట్లాడుతున్న కమిషనర్‌ రమేష్‌బాబు


 ముంపు ప్రాంతాల సమస్యకు పరిష్కారం చూపాలి

 పంట కాలువల ఆక్రమణలు తొలగించాలి

ఆత్మకూరు మున్సిపల్‌మీట్‌లో సభ్యులు

ఆత్మకూరు, నవంబరు 30 : ‘ఆత్మకూరు మున్సిపాలిటీ లో ముంపు ప్రాంతాలకు ఏర్పడుతున్న సమస్యలపై దృష్టి సారించాలి. పంటకాలువల ఆక్రమణలు తొలగించాలి.  డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలి. వరద బాఽధితులను ఆదుకోవాలి’ అంటూ పలువురు కౌన్సిలర్లు  కోరారు. స్థానిక మున్సిపల్‌ సమావేశ మందిరంలో మంగళవారం అత్యవస ర సమావేశం నిర్వహించారు. వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ కేవీ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ పంట కాలువల ఆక్రమణ, నిబంధనలకు వ్యతిరేకంగా లేఅవుట్లు, ముంపు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి సబ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు.  వైసీపీ కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వీధుల్లో బ్లీచింగ్‌ చల్లడం లేదని,  పంట కాలువలపై ఇస్టారాజ్యంగా  వంతెనలు కడుతున్నా అధికా రులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. టీడీపీ కౌన్సిల ర్లు షేక్‌ గౌస్‌బాష, మాదాల శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచి, పంట కాలువులను శుభ్రం చేయించాలన్నారు.  5వ వార్డు పరిధిలో రోడ్లు, డ్రైనేజీ అధ్వానంగా ఉన్నాయని ఆ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మహబూబ్‌బాష పేర్కొన్నారు. కౌన్సిలర్లు పొడమేకల పెంచలయ్య, తిరుపతమ్మ తదితరులు తమ వార్డు పరిధిలోని సమస్యలను  సమావేశం దృష్టికి తెచ్చారు.

సమష్టిగా కృషి చేద్దాం


చివరగా చైర్‌పర్సన్‌ జీ వెంకటరమణమ్మ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దామని తెలిపారు. కమిషనర్‌ ఎం రమేష్‌బాబు మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ చేయూత నివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-01T03:09:18+05:30 IST