మునగ రైతులను ముంచిన పెనుగాలులు

ABN , First Publish Date - 2021-05-15T06:50:44+05:30 IST

పెనుగాలులు మండలంలో ని నక్కబొక్కలపాడులో మునగ రైతులను నిండా ముంచాయి. వారిని కోలుకోలేని దెబ్బతీశాయి. 40 ఎకరాల్లో చెట్లు వేళ్లతో సహా కూలిపోవడంతో రైతు లు లబోదిబోమంటున్నారు

మునగ రైతులను ముంచిన పెనుగాలులు
వర్షానికి నేలకొరిగిన మునగ చెట్లను లేపుతున్న రైతు వీరాంజినేయులు

వేర్లతో సహా కూలిన చెట్లు 

నక్కబొక్కలపాడులో 40 ఎకరాల్లో నష్టం 


బల్లికురవ, మే 14 : పెనుగాలులు మండలంలో ని నక్కబొక్కలపాడులో మునగ రైతులను నిండా ముంచాయి. వారిని కోలుకోలేని దెబ్బతీశాయి. 40 ఎకరాల్లో చెట్లు వేళ్లతో సహా కూలిపోవడంతో రైతు లు లబోదిబోమంటున్నారు  మండలంలో గురువా రం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిం ది. పెనుగాలులు వీచాయి. దీంతో నక్కబొక్కలపా డుకు చెందిన బొల్లా కోటేశ్వరరావు, చల్లగుండ్ల హ నుమంతరావు, దర్శి నాగార్జున, కట్టా దుర్గాప్రసాద్‌, ఏటి సుబ్బారావు, దర్శి మురళి, వెంకటేశ్వర్లు, మరో 20 మంది రైతులకు చెందిన 40 ఎకరాల్లో చెట్లు దెబ్బతిన్నాయి ఈ ఏడాది కాపు బాగా ఉండటంతో మంచి లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. అ యితే పెనుగాలులకు  మునగ చెట్లు వేర్లతో సహా నేలకొరిగాయి. కొన్ని కొమ్మలు విరిగి పనికి రాకుం డాపోయాయి.  రైతులు శుక్రవారం పొలానికి వెళ్లి నేలకొరిగిన మునగ చెట్లను చూసి కన్నీరుమున్నీర య్యారు ఇప్పటికే ఎకరాకు రూ.80 వేల వర కూ పెట్టుబడులు పెట్టామని, ఒక్కపైసా కూడా చేతికి రాకుండానే పంట దెబ్బతిం దని  వారు వాపోయారు. అధికారులు తో టలను పరిశీలించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


Updated Date - 2021-05-15T06:50:44+05:30 IST