హోం ఐసోలేషన్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-05T05:54:26+05:30 IST

హోం ఐసోలేషన్‌లో ఉండేవారు ఇంటికే పరిమితం కావాలని, లేని యెడల కొవిడ్‌కేర్‌ సెంటర్‌కి తరలిస్తామని నగర కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు.

హోం ఐసోలేషన్‌ నిబంధనలు పాటించాలి

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), మే 4: హోం ఐసోలేషన్‌లో ఉండేవారు  ఇంటికే పరిమితం కావాలని, లేని యెడల కొవిడ్‌కేర్‌ సెంటర్‌కి తరలిస్తామని నగర కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు. మంగళవారం పొత్తూరు, నాయుడుపేట, నల్లపాడు రోడ్‌, శ్రీలక్ష్మీనగర్‌లో హోం ఐసోలేషన్‌ ఉన్నవారిని పరామర్శించారు. ఐసోలేషన్‌లో ఉండే వారికి కిట్‌ అందిందా,  రోజు ఏఎన్‌ఎంలు ఆక్సిజన్‌ లెవల్స్‌ చెక్‌ చేస్తున్నారా లేదా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, వలంటీర్లు ఐసోలేషన్‌లో ఉండేవారిని నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వలంటీర్లను తొలగిస్తామని,  హెచ్చరించారు. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే టెస్ట్‌ కి పంపాలని, ఫలితం వచ్చే వరకు వారిని ఇంటిలోనే ఉంచాలని తెలిపారు. సచివాలయ పరిధిలో సమస్యలు ఉంటే నోడల్‌ అధికారికి తెలియ చేయాలన్నారు. ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ కొవిడ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని, సోడియం హైపోక్లోరైడ్‌ స్ర్పే చేయించాలన్నారు.  పర్యటనలో డీఈఈ శివకుమార్‌, ఏఈ చైతన్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T05:54:26+05:30 IST