మునిసిపల్‌ ఎన్నికలపై పర్యవేక్షణ

ABN , First Publish Date - 2021-03-02T05:38:24+05:30 IST

జిల్లాలో గుంటూరు నగరపాలక సంస్థ, ఏడు పురపాలక సంఘాల ఎన్నికల పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు.

మునిసిపల్‌ ఎన్నికలపై పర్యవేక్షణ

వివిధ వాభాగాలకు ఇన్‌చార్జిల నియామకం

గుంటూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గుంటూరు నగరపాలక సంస్థ, ఏడు పురపాలక సంఘాల ఎన్నికల పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. పర్యవేక్షణ అధికారులు మునిసిపల్‌ ఎన్నికల రిటర్నింగ్‌(ఆర్‌వో) అధికారులతో చర్చించి, పోలింగ్‌ ప్రశాంతంగా జరగడానికి ఏర్పాట్లు చేస్తారు.  పోలింగ్‌ సిబ్బంది నియామకం, ఎన్నికల ప్రక్రియపై శిక్షణ, బడ్జెట్‌లకు సంబంధించి ఆసర జేసీ శ్రీధర్‌రెడ్డిని, పోలింగ్‌,  ఎన్నికల సిబ్బంది రవాణా, రూట్‌మ్యాప్‌ తయారీల కోసం డీటీసీ మీరాప్రసాద్‌ను, పోలింగ్‌, ఎన్నికల సిబ్బంది రవాణా, రూట్‌ ప్లాన్‌ తయారీకి జడ్పీ సీఈవో చైతన్యను, ఎన్నికల, పోలింగ్‌ సామగ్రి సరఫరా పర్యవేక్షణకు పులిచింతల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డేవిడ్‌రాజును నియమించారు. మోడల్‌ కోడ్‌ అమలు, ఫ్లెక్సీల తొలగింపు పర్యవేక్షణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మనోరమను, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు, బిల్లుల సేకరణలపై పరిశీలనకు జిల్లా ఆడిట్‌ అధికారి  కేవీ సుబ్బారావును, ఓటర్ల హెల్ప్‌లైన్‌, సమస్యాత్మక పోలీస్‌ స్టేషన్ల గుర్తింపు కోసం సివిల్‌ సప్లయిస్‌ విజిలెన్స్‌ ఎస్‌డీసీ కుమార్‌ను, శాంతి భద్రతలు, అత్యంత సమస్యాత్మక పోలీస్‌ స్టేషన్ల గుర్తింపులనకు రూరల్‌ ఏఎస్పీ ప్రసాద్‌ను, బ్యాలెట్‌ పేపర్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సుల పంపిణీ పర్యవేక్షణకు సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదనరావును, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ పరిశీలనకు బీసీ సంక్షేమశాఖ డీడీ కల్పనాబేబిని, పోలింగ్‌ స్టేషన్ల పరిశీలనకు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ధనుంజయను, పోలింగ్‌ స్టేషన్ల వద్ద కొవిడ్‌ అంశాల పరిశీలనకు డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ను, మెటీరియల్‌ పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంఽధంచి సీపీవో వెంకటేశ్వర్లును నియమించారు. 


Updated Date - 2021-03-02T05:38:24+05:30 IST