కనీస వేతనం కోసం పాఠశాలల స్వీపర్ల ధర్నా

ABN , First Publish Date - 2022-01-29T03:37:27+05:30 IST

మున్సిపల్‌ పాఠశాలల స్వీపర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ స్కూల్‌ స్వీపర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ సహకారంతో ధర్నా చేశారు.

కనీస వేతనం కోసం పాఠశాలల స్వీపర్ల ధర్నా
మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు

కావలి, జనవరి 28: మున్సిపల్‌ పాఠశాలల స్వీపర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ స్కూల్‌ స్వీపర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ సహకారంతో ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ 20 ఏళ్లుగా వంశపారం పర్యంగా తమ కుటుంబాలు రూ.5 వేలకు స్కూల్‌ స్వీపర్లగా పనిచేస్తుండగా ప్రస్తుతం రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా తమకు కనీస వేతనం రూ26 వేలు ఇవ్వాలని కోరారు. సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పీ. పెంచలయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా స్వీపర్ల జీవితాలలో మార్పులు రాలేదన్నారు. 


Updated Date - 2022-01-29T03:37:27+05:30 IST