Abn logo
Jul 6 2020 @ 05:25AM

మున్సిపల్‌ కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ

మంచిర్యాల టౌన్‌, జూలై 5: జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కమిషనర్‌ జి స్వరూపారాణి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో దుకాణాలను తనిఖీ చేసి పరిశుభ్రత పాటించని, ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్న వ్యాపారులకు జరిమానాలు విధించారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు 10వ వార్డులోని ఏసీసీలో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలకు కార్యక్రమంలో భాగంగా టైర్ల దుకాణం వద్ద చెత్త, చెదారం, పాత టైర్లను తొలగించారు. ఈ సందర్భంగా నిర్వాహకునికి రూ. 2 వేలు జరిమానా విధించారు. స్థానికంగా మటన్‌ షాపును తనిఖీ చేసి పరిశుభ్రత పాటించనందుకు రూ. 1000. టిఫిన్‌ సెంటర్‌కు రూ. 500 జరిమానా విధించారు. అలాగే ప్లాస్టిక్‌ వినియోగిస్తున్న బాలాజీ వైన్‌ షాపునకు రూ. 2 వేలు, శ్రీనివాస కిరాణా షాపునకు రూ. 500, ఆంజనేయులు కిరాణ దుకాణానికి రూ. వెయ్యి, రవీంధర్‌ కిరాణా షాపునకు రూ. వెయ్యి జరిమానా విధించారు. 

Advertisement
Advertisement