ఏకగ్రీవాలకు చెక్‌ పెట్టిన టీడీపీ

ABN , First Publish Date - 2021-03-04T05:24:12+05:30 IST

ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంపు రాజకీయాలు జరగడం సాధారణం.

ఏకగ్రీవాలకు చెక్‌ పెట్టిన టీడీపీ

క్యాంప్‌ రాజకీయంతో అభ్యర్థులను బరిలో నిలిపిన నేతలు


నరసాపురం, మార్చి 3: ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంపు రాజకీయాలు జరగడం సాధారణం. అభ్యర్థులను పోటీలో ఉంచడానికే క్యాంపు రాజకీయం నడపాల్సిన పరిస్ధితి తలెత్తింది. టీడీపీ తరపున నామినేషన్‌ వేయించిన అభ్యర్థులు ఉపసంహరించుకోకుండా 13మంది అభ్యర్థులతో శిబిరం నిర్వహించారు. బుధవారం 5వ వార్డులో అభ్య ర్ధి నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో అప్రమత్తమైన ఆ పార్టీ నేతలు 13 మంది ఆభ్యర్ధుల్ని రహస్యప్రదేశానికి తరలించారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిసే వరకు వారిని పట్టణానికి తీసుకురాలేదు. చివరి క్షణం లో మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకొచ్చి బీ ఫారం సమర్పించారు. దీంతో మరికొన్ని వార్డుల ఏకగ్రీవానికి చెక్‌ పడింది. 2, 17, 18, 24, 30 వార్డులను కూడా ఏకగ్రీవం చేసుకునేందుకు అఽధికారపార్టీ చివరి క్షణం వరకు విశ్వప్రయత్నాలు చేసింది. 24వ వార్డులో పోటీ చేస్తున్న బీజీపీ అభ్యర్థి చివరి క్షణంలో బీ ఫాం అందించారు. 


నరసాపురం బరిలో 75 మంది అభ్యర్థులు

నామినేషన్ల ఉపసంహరణ ముగియ డంతో మున్సిపల్‌ ఎన్నికల బరిలో 75 మంది అభ్యర్థులు ఉన్నా రు. మూడు వార్డులు ఏకగ్రీవం కావడంతో 28 వార్డుల్లో పోటీ జరగనుంది. నామినేషన్ల పరిశీలన తరువాత 168 నామినేషన్లు మిగిలాయి. వాటిలో 21 మంది రెండు సెట్ల నామినేషన్లు వేయ డంతో ఒక సెట్‌ తీసివేయడంతో 147 నామినేషన్లు మిగిలాయి. మంగళవారం 15 మంది ఉపసంహరించుకోగా 132 నామినే షన్లు మిగిలాయి. రెండో రోజు బుధవారం 54 నామినేషన్లు ఉప సంహరించారు. 78 మంది అభ్యర్థుల నామినేషన్లు ఉండగా మూడు ఏక గ్రీవం కావడంతో 75 మంది పోటీలో నిలిచారు.

Updated Date - 2021-03-04T05:24:12+05:30 IST