మునిసిపల్‌ ఎన్నికలు సజావుగా సాగాలి

ABN , First Publish Date - 2021-02-25T06:35:50+05:30 IST

ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలకు లోబడి ప్రతిఒక్కరూ పని చేయాలని జాయింట్‌ కలెక్టర్‌-3 గోవిందరావు సూచించారు.

మునిసిపల్‌ ఎన్నికలు సజావుగా సాగాలి
ఉద్యోగుల శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న జేసీ-3 గోవిందరావు

   అధికారుల శిక్షణ శిబిరంలో  జేసీ-3 గోవిందరావు 

నర్సీపట్నం, ఫిబ్రవరి 24 : ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలకు లోబడి ప్రతిఒక్కరూ పని చేయాలని జాయింట్‌ కలెక్టర్‌-3 గోవిందరావు సూచించారు. బుధవారం ఇక్కడి మునిసిపల్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, సహాయ, అదనపు ఎన్నికల అధికారులకు ఏర్పాటైన శిక్షణ శిబిరంలో మాట్లాడారు.  పోలింగ్‌ అధికారులు తప్పని సరిగా సంబంధిత పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, అక్కడ లోటుపాట్లు గుర్తించాలన్నారు.  నిరంతర విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. 

‘శిక్షణకు హాజరుకాని వారికి షోకాజ్‌’ 

ఇదిలావుంటే, శిక్షణకు గైర్హాజరైన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని, కలెక్టర్‌ దృష్టిలో పెడతామని సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య స్పష్టం చేశారు. బుధవారం శిక్షణ శిబిరానికి కొంత మంది జోనల్‌ ఆఫీసర్లు హాజరు కాలేదు. వారినుద్దేశించి మాట్లాడుతూ శిక్షణకు రిజర్వ్‌లో ఉన్న అధికారులతో సహా ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు.  పంచాయతీ ఎన్నికల్లో విధులకు హాజరుకాని ఇద్దరిపై జిల్లా కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.  ఇప్పటికిప్పుడు మెడికల్‌ లీవ్‌లు తీసుకొస్తే.. పరిగణనలోకి తీసుకోవడం జరగదని, కేవలం గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వివరించారు. మునిసిపల్‌ ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చూడాలన్నారు.  మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.కనకారావు తదతరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T06:35:50+05:30 IST