Abn logo
Feb 24 2021 @ 23:14PM

ఎన్నికల నిర్వహణకు చర్యలు

ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ కోసం పాఠశాలలో పరిశీలిస్తున్న ఆర్డీవో లక్ష్మారెడ్డి

కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి 

కొవ్వూరు, ఫిబ్రవరి 24 : మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాటుకు .బుధవారం పట్టణంలోని పలు పాఠశాలలను డీఎస్పీ బి.శ్రీనాథ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కేటీ సుధాకర్‌తో కలిసి ఆయన పరిశీలించారు.  పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, మున్సిపల్‌ హైస్కూల్‌, వేములూరు దీప్తి పాఠశాలలో కౌంటింగ్‌, స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పా టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రత వంటి అంశాలను పరిశీలించారు. వేములూరు దీప్తి పాఠశాల మొదటి అంతస్తులో స్ట్రాంగ్‌ రూమ్‌, రెండో అంతస్తులో కౌంటింగ్‌ హాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేస్తున్నామన్నారు. ఎస్‌ఐ కె.వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement