సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ABN , First Publish Date - 2022-01-29T02:55:08+05:30 IST

న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న కార్మిక సంఘం నాయకులు

గూడూరు, జనవరి 28: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కరువుభత్యం, మధ్యంతరభృతి ఇవ్వాలన్నారు. 60 ఏళ్లు నిండిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో గోపీనాథ్‌, కోటేశ్వరరావు, భూలోకం, మురళి, మణి తదితరులు పాల్గొన్నారు.

వెంకటగిరి(టౌన్‌):  పారిశుధ్య కార్మికులను ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని ఏపీ మున్సిఫల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌, జీతాలు, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్‌, చంద్రశేఖర్‌, వెంకటేశ్వర్లు, సుబ్బమ్మ పోలయ్య, మునెయ్య తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-29T02:55:08+05:30 IST