Advertisement
Advertisement
Abn logo
Advertisement

లంచం ఇస్తేనే పనులు

మునిసిపల్‌ అధికారుల తీరుపై వైస్‌ చైర్మన్‌ ధ్వజం


జంగారెడ్డిగూడెం టౌన్‌, నవంబరు 30: పట్ణణ ప్రణాళిక విభాగం అవినీతి మయంగా తయారైందని, లంచం ఇస్తేనే పనులు జరుగుతాయని వైస్‌ చైర్మన్‌ ముప్పిడి అంజి ధ్వజమెత్తారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మి అధ్యక్ష తన మంగళవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ అధికారుల తీరును ఎండగట్టారు. పట్ణణంలో ఇల్లు నిర్మించుకునే వారికి అప్రూవల్‌ కావాలంటే లంచం లేకుండా పనులు కావడం లేదని ఆరోపించారు. అధికా రుల తీరుతో పాలకవర్గం ప్రజల్లో చులకనగా తయారైందన్నారు. అదికారులు లంచగొండితనాన్ని విడనాడి పారదర్శనపాలన అందించాలని ఆయన కోరా రు. వైస్‌చైర్మన్‌ ఆరోపణలపై కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇంటి ప్లాన్‌ అప్రూవల్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. చెల్లించాల్సి న మొత్తం కంటె ఒక్క రూపాయి కూడా ఎవరికీ  చెల్లించనక్క ర్లేదన్నారు. దరఖాస్తుదారు మున్సిపల్‌ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు.


సంపూర్ణ పారిశుధ్య పట్టణంగా తీర్చిదిద్దుతాం


సంపూర్ణ పారిశుధ్య పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్నిరకాల చర్యలు తీసు కుంటున్నామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మి అన్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. గార్భేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను నిర్మించేందుకు రూ.56 లక్షల వ్యయం అవుతుందని, ఇందుకు 29 సెంట్ల స్దలాన్ని గుర్తాంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనన్నట్లు వెల్లడించారు. పట్టణాభివృధ్దిలో అధికారులు, కౌన్సిల్‌ సమన్వయంతో పనిచేయాలని, వివాదాలకు తావులేకుండా పనిచేయాలని కోరారు.

Advertisement
Advertisement