మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2020-10-30T11:08:27+05:30 IST

సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు కలెక్టరే ట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో ..

మున్సిపల్‌ కార్మికుల ధర్నా

 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌


సిరిసిల్ల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు కలెక్టరే ట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్‌ కార్మికులు ర్యాలీగా  కలెక్టరేట్‌కు చేరుకోని ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ అంజయ్యకు వినతిపత్రం అందించారు. కాం ట్రాక్ట్‌ కార్మికులుగా పనిచేస్తున్న తమకు పీఎఫ్‌ డబ్బు లు జమచేయడం లేదని తెలిపారు. కాంట్రాక్ట్‌ కార్మికు లు, పర్మినెంట్‌ కార్మికులు ఒకే రకమైన పనులు చేస్తు న్నా వేతనాల్లో వ్యత్యాసం ఉందని స మానంగా వేతనం ఇవ్వాలని అన్నారు. కార్మికులను పర్మినెంట్‌ చేయాలని రూ. 24 వేల వేతనం తగ్గకుండా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మోర అజయ్‌, జిల్లా కమిటీ సభ్యుడు ఎల్లయ్య, గోవిం దు లక్ష్మణ్‌, సు ల్తాన్‌ నర్సయ్య, కాసర్ల శంకర్‌, గడ్డి కాశయ్య, బాలయ్య, భార తి, విజయ, పుష్ప, లచ్చవ్వలు పాల్గొన్నారు. 


వేములవాడ: 11వ పీఆర్సీ ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు పందుల మల్లేశం డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం నాడు వేములవాడ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేసి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:08:27+05:30 IST